in

Mahesh’s aadhar center Visit Becomes Hot Topic!

సాధారణంగా మనకు నచ్చిన సెలబ్రిటీలు ఎవరైనా సినిమాల్లో కాకుండా బయటకనిపిస్తే.. వాళ్లను చూసిన ఆనందం అస్సలు మార్చిపోలేం. వీలైతే వాళ్లతో సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తాం. అందుకే చాలామంది స్టార్స్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తారు. ఒకవేళ వాళ్లకి ప్రైవసీ కావాలంటే విదేశాలకు వెళిపోతారు. అలాంటిది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబే స్వయంగా అభిమానుల మధ్యలోకి వస్తే ఎలా ఉంటుంది. మామూలుగా మహేష్ సినిమాల్లో తప్ప బయట కనిపించడం చాలా అరుదు. అలాంటి ఈ మిస్టర్ కూల్ హైటెక్ సిటీలోని ఓ ఆధార్ కార్డు సెంటర్‭లో ప్రత్యక్షమయ్యారు.

తన చుట్టూ ఎలాంటి హడావుడి లేకుండా కూల్‭గా పని ముగించుకుని వెళిపోయారు. తన ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం మహేష్ బాబు హైటెక్ సిటీలోని దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ వెరిఫికేషన్ సెంటర్‭కు వచ్చారు. మహేష్ స్వయంగా రావడం చూసిన అక్కడి సిబ్బంది నమ్మలేకపోయారు. మహేష్ ఆధార్‌ వెరిఫికేషన్‌ చేసుకుంటున్న దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించారు. లాంగ్‌ హెయిర్‌ కట్‌, క్యాజువల్‌ షర్ట్‌లో తన చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మహేష్.. ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28 చిత్రం షూటింగ్‭తో బిజీగా ఉన్నారు..!!

Vijay Sethupathi, Chiyaan Vikram, Saif Ali Khan who’s tarak’s villain?

VISWANADHUDI NOTA ANDALA NATUDI MAATA!