in

Samantha apologies to Vijay Devarakonda fans!

మంత విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటిస్ రావడంతో షూటింగ్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కాశ్మీర్‌లో ఓ నెల రోజుల పాటుగా శివ నిర్వాణ ఈ జోడి మీద సీన్స్ షూట్ చేశాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు. ఇక సమంత నెక్ట్స్ మంత్‌లోపు సెట్స్ మీదకు రాకపోతే.. కొత్త సినిమాను చేసుకుంటాను అని శివ నిర్వాణ చెప్పాడట. అందుకే ఈ సినిమా గురించి ఓ నెటిజన్ సమంతను అడిగేశాడు.

విజయ్ ఖుషి సినిమా సంగతి ఏంటి? అని సమంతను ఓ ఫ్యాన్ నిలదీశాడు. దీంతో సమంత ఇలా స్పందించింది. ఖుషి సినిమా షూటింగ్ త్వరోలనే ప్రారంభిస్తాం.. విజయ్ ఫ్యాన్స్‌ నన్ను క్షమించాలి.. అని దండం పెట్టేసింది. సమంత వేసిన ఈ ట్వీట్ మీద విజయ్ స్పందించాడు. నువ్ మళ్లీ పూర్తి ఆరోగ్యం.. చిరు నవ్వులతో తిరిగి సెట్స్ మీదకు రావాలని మేం అంతా కూడా ఎదురుచూస్తున్నాం అని విజయ్ ట్వీట్ వేశాడు. సమంత గత నెలలోనే బయటకు వచ్చింది. శాకుంతలం ట్రైలర్ ఈవెంట్‌లో మెరిసింది. ఆ తరువాత ముంబైలో తన వెబ్ సిరీస్ షూటింగ్ కోసం మకాం పెట్టేసింది..!!

Flora Saini reveals details about her abusive relationship with producer!

AKKINENI VAARI” THATHA” GAARU YEVARU?