in

Flora Saini reveals details about her abusive relationship with producer!

శాషైనీ గుర్తుంది క‌దా? న‌ర‌సింహ‌నాయుడు లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన క‌థానాయిక‌. ఆమ‌ధ్య‌ ఫ్లోరా షైనీగా పేరు మార్చుకొంది. కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లూ చేసింది. ఇప్పుడు జీవితంలో స్థిర‌ప‌డ‌దామ‌నుకొంటోంది. త్వ‌ర‌లోనే ఆశాషైనీ పెళ్లి చేసుకోబోతోంది. అయితే.. ఓ నిర్మాత‌పై ఆషా సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసింది. కెరీర్ మొదలైన కొత్త‌లో ఓ నిర్మాత‌ని న‌మ్మి బాగా మోస‌పోయాన‌ని, త‌ను త‌న‌ని శారీర‌కంగా, మాన‌సికంగా హింసించాడ‌ని, మెహంపై, ప్రైవేటు పార్ట్‌పై ర‌క్తం వ‌చ్చేలా కొట్టేవాడ‌ని..త‌న బాధ‌ని వెళ్ల‌గ‌క్కింది.

త‌న హింస భ‌రించ‌లేక వ‌దిలి వ‌చ్చేశాన‌ని, ఆ త‌ర‌వాత మ‌ళ్లీ జీవితంలో సెటిల్ అవ్వ‌డానికి చాలా కాలం ప‌ట్టింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మొత్తానికి..ఫ్లోరా షైనీ జీవితం ఇప్పుడు బాగానే ఉంది. కాక‌పోతే ఆ నిర్మాత ఎవ‌రో మాత్రం ఫ్లోరా చెప్ప‌డం లేదు. చిత్ర‌సీమ‌లో క‌థానాయిక‌ల్ని ఆట వ‌స్తువులుగా భావిస్తార‌ని చెప్ప‌డానికి ఫ్లోరా జీవిత‌మే నిద‌ర్శ‌నం. ఫ్లోరా షైనీ కామెంట్లు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ నిర్మాత ఎవ‌రూ..అంటూ అంద‌రూ ఆరా తీయ‌డం మొద‌లెట్టారు. ఫ్లోరా నోరు విప్పితే గానీ ఆ నిర్మాత ఎవ‌రో బ‌య‌ట‌కు తెలీదు..!!

happy birthday BRAHAMANANDAM!

Samantha apologies to Vijay Devarakonda fans!