in

AKKINENI VAARI” THATHA” GAARU YEVARU?

క్కినేని నాగేశ్వర్ రావు గారి తాత గారు ఒకరు సినీ దర్శకుడుగ ఉండే వారు, ఆయనను అక్కినేని గారు కూడా ఆప్యాయంగా తాత అని పిలిచేవారట!! అయన ఎవరో మీకు తెలుసా? ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య అనగానే మనకు వినోద వారి దేవదాసు గుర్తుకు వస్తుంది, వేదాంతం వారు దర్శకుడు కాక ముందు దాదాపుగా ఒక పన్నెండు చిత్రాలకు నృత్య దర్శకుడిగా చేసారు, స్వతహాగా శాస్త్రీయ నృత్య కళాకారుడు అయిన వేదాంతం వారు నృత్య దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు, పనిలో పనిగా కొన్ని చిత్రాలలో నటించారు కూడా. అయన పేరులో ఉన్న వేదాంతం కారణంగానో, ఏమో, అయన విషాద చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ గ మారారు ఒక దశలో. ఆ క్రమంలోనే అక్కినేని నట జీవితాన్ని మలుపు తిప్పిన ” దేవదాసు” చిత్రం ఒకటి.

వీరిద్దరి అనుబంధం చాల గొప్పది. 1945 లో “మాయలోకం ” అనే చిత్రంలో అక్కినేని, వేదాంతం ఇద్దరు కలసి నటించారు, అప్పటికి ఇంకా వేదాంతం వారు దర్శకుడు కాలేదు. మాయలోకం చిత్రంలో వేదాంతం వారు అక్కినేని వారికీ తాత గ నటించారు. అప్పటి నుంచి అక్కినేని గారు వేదాంతం రాఘవయ్య గారిని తాత అని ప్రేమగా పిలిచే వారు, నువ్వు నన్ను తాత అంటే అందరు నన్ను ముసలివాడు అనుకుంటారు, కాబట్టి నేను కూడా నిన్ను తాత అని పిలుస్తాను అని చెప్పారట వేదాంత గారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరి ని ఒకరు తాత అని ముద్దుగా పిలుచుకునే వారట, ఇదండీ ఇద్దరు తాతల ముచ్చట. గత కాలమంతా ఎంతో ఘనమైనది అన్నట్లు, ఆ రోజుల్లోని అనుబంధాలు, ఆప్యాయతలు వేరే లెవెల్ అనే చెప్పాలి. వాతావరణం, మనుషుల మనసులు, ఇప్పట్లా, మరి అంత కలుషితం కానీ స్వచ్చమయిన రోజులు అవి..!!

Samantha apologies to Vijay Devarakonda fans!

thamanna to play the role of Jamuna in the biopic?