
ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నుంచి విశ్వంభర అలాగే కాకా సినిమాలు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ స్క్రీన్స్ పై అలరించిన మెగాస్టార్ బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కూడా రాణించారు. అయితే చిరు ఓటీటీలో కూడా ఎప్పుడో ఎంటర్ కావాల్సి వుంది కానీ అప్పుడు కుదరలేదు. సెన్సేషనల్ హిట్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ ని మెగాస్టార్ మిస్ చేసుకున్నారు.
అయితే ఫైనల్ గా మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీకి ఇప్పుడు రంగం సిద్ధం అయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో చిరు తన ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. అయితే చిరు ఓ టాక్ షోలో కనిపిస్తారని దీనికి మెగావర్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా లాక్ అయినట్టు వినిపిస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరి మెగాస్టార్ ఓటీటీ డెబ్యూ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. కాకా, విశ్వంభర సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి..!!
