సినిమాలు హిట్లు అవుతూ రావడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అని పేరు పడిపోయింది. ఈ క్రమంలో రష్మిక మందన చేస్తున్న కొన్ని సినిమాలు బోల్తా పడుతున్నా ఆమె హిట్ల లెక్కలోకి వేసుకుంటూ నిర్మాతలు ఆమెకు బంగారు అవకాశాలు ఇస్తూ వెళుతున్నారు. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ ని కూడా దాటుకుని బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న రష్మిక మందన అనేక సందర్భాలలో తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి బదులు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోలర్లకు టార్గెట్ గా మారుతుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద మాట్లాడిన రష్మిక మందన ఈ ట్విట్టర్లో ట్రోల్స్ అలాగే తనను టార్గెట్ చేస్తూ తన క్యారెక్టర్ ని టార్గెట్ చేస్తూ తన స్త్రీత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఆమె అబ్బాయిలా కనిపిస్తోంది అంటూ జరుగుతున్న ట్రోలింగ్ మీద ఆమె స్పందించింది. ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ కొన్నిసార్లు తాను కూడా తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటానని, నేను సినిమాలు నిలిపేయాలా? అని అప్పుడప్పుడు అనిపిస్తుందని కూడా ఆమె కామెంట్ చేసింది. ఇక రష్మిక మందన ప్రస్తుతానికి వరుస సినిమాలు వెళుతోంది. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాల్లో భాగమవుతోంది..!!