సినిమా అనేది” మేక్ బిలీవ్” ప్రక్రియ, సాధారణంగా రిస్కీ షాట్స్ లో డూప్ లతో, గ్రాఫిక్స్ తో మేనేజ్ చేస్తుంటారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సార్లు చిన్న పొరపాట్ల వలన పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. కొన్ని సార్లు ప్రొడక్షన్ టీం చేసిన పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు నటి, నటులు. యెన్.టి.ఆర్. నటించిన “యుగంధర్” చిత్రం షూటింగ్ సందర్బంగా ప్రొడక్షన్ అసిస్టెంట్ చేసిన చిన్న పొరపాటు వలన, యెన్.టి.ఆర్ రెండు రోజులు ఆహారం తినకుండా కేవలం ఫ్రూట్ జ్యూస్ లతో గడపవలసి వచ్చింది. “యుగంధర్” చిత్రంలోని “ఓరబ్బ ఏసుకున్న కిళ్ళీ” పాట కోసం కిళ్ళీలు తెప్పించారు , పాట మొదలయింది యెన్.టి.ఆర్. కిళ్ళీ తరువాత కిళ్ళీ నోట్లు కుక్కుకొని యాక్ట్ చేస్తున్నారు, యెన్.టి.ఆర్. కమ్మిట్మెంట్ గురించి అందరికి తెలిసిందే ఆయన యాక్టింగ్ మూడ్లో ఉన్నప్పుడు సీన్ గురించి తప్ప్ప మిగతా విషయాలు పట్టించుకోరు.
షూటింగ్ పూర్తి అయింది, యెన్.టి.ఆర్. నోరు పొక్కిపోయింది, షూటింగ్ కోసం స్వీట్ కిళ్ళీలు తెమ్మంటే, జర్దా కిళ్ళీలు తెచ్చాడు ప్రొడక్షన్ అసిస్టెంట్, అంతే కాదు కిళ్ళీ వేసుకోగానే నోరు బాగా పండాలి అని చెప్పి ఎక్స్ట్రా సున్నం వేయించి మరీ తెచ్చాడట, ఇదేమి తెలియని యెన్.టి.ఆర్ కిళ్ళీ, మీద కిళ్ళీ నములుతూ పాట కంప్లీట్ చేసేసారు, అంతా అయ్యాక చూసుకుంటే నోరు పొక్కిపోయింది, ఆ తరువాత రెండు రోజుల వరకు ఎటువంటి ఆహారం తీసుకోవటం కుదరక కేవలం ఫ్రూట్ జ్యూస్ తో గడిపారట. ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్ ని కేకలేస్తారేమో అనుకున్నారట అందరు, కానీ యెన్.టి.ఆర్ అతను స్వీట్ కిళ్ళికి బదులు జర్దా కిళ్ళి తేవటం వలన సాంగ్ చాల బాగా వచ్చింది అని చెప్పారట, అది వినిన ప్రొడక్షన్ టీం ఊపిరి పీల్చుకున్నారట..!!