in

Ravi Teja’s ‘Eagle’, gets kerala kutty anupama on board?

కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి ‘కార్తికేయ 2′ భారీ హిట్ ను అందించింది. ఆమె కెరియర్లో 100 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆ తరువాత సినిమాలుగా ఆమె నుంచి రావడానికి ’18 పేజెస్’ .. ‘ బట్టర్ ఫ్లై’ రెడీ అవుతున్నాయి. తాజాగా ఆమె రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ‘కార్తికేయ 2’ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా .. ఎడిటర్ గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఈ సినిమాకి ‘ఈగల్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన అనుపమను తీసుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మధ్య కాలంలో రవితేజ వరుసగా కుర్ర హీరోయిన్లతో జోడీ కడుతూ వస్తున్నాడు. ఆ జాబితాలోకి అనుపమ చేరడం విశేషం. ‘ఈగల్’ కి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది..!!

S.V.R VERSUS REBEL STAR!

payal rajput: brutally handled by the staff