మహానటి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ఇప్పుడు “సీతారామం” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న మరియు తరుణ్ భాస్కర్ లు ఈ సినిమా లో ముఖ్యపాత్రలు పోషించారు..ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న థియేటర్లలో విడుదల అయ్యింది. తాజాగా సినిమా హీరోయిన్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..
ఇక ఈ సినిమాలో సీత పాత్ర పోషించిన మృణాల్ ఠాకూర్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ముందుగా ఒక స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట…ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజ హెగ్డే. ముందుగా ఈ సినిమాలో సీత అంటే హీరోయిన్ పాత్ర కోసం పూజ హెగ్డే నీ సంప్రదించారు డైరెక్టర్ హను రాఘవపూడి. కానీ అప్పుడు పూజా హెగ్డే కరోనాతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేయలేక అదే సమయంలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలా కరోనా కారణంగా పూజ హెగ్డే చేతుల్లోంచి ఒక సూపర్ హిట్ సినిమా చేయి జారిపోయింది అన్నమాట..