in

Aamir Khan expresses his desire to work with rajamouli!

ర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయడంపై మరోసారి ఆసక్తి చూపించాడు ఆమిర్‌ ఖాన్‌. తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో కరీనాకపూర్‌తో కలిసి వచ్చాడతడు. తన లేటెస్ట్‌ మూవీ లాల్‌ సింగ్‌ చడ్డా ప్రమోషన్లలో ఆమిర్‌ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తుందన్న ఆశతో ఆమిర్‌ ఉన్నాడు..చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్న అతడు.. లాల్‌ సింగ్‌ చడ్డాతో రికార్డులు తిరగరాయడమే కాదు.. తన తర్వాతి సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నాడు.

ముఖ్యంగా డైరెక్టర్ల ఎంపిక విషయంలో ఆమిర్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాల్లో తాను కలిసి పని చేయాలనుకుంటున్న డైరెక్టర్ల గురించి కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఆమిర్‌ చెప్పుకొచ్చాడు..ఊహించినట్లే ఈ లిస్ట్‌లో రాజమౌళియే టాప్‌లో ఉన్నాడు. చాలా మంది డైరెక్టర్లతో కలిసి పని చేయాలని ఉన్నా.. ఇందులో రాజమౌళి పేరే ముందుంటుందని అతను అన్నాడు. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన సందర్భాల్లోనూ బాహుబలి మేకర్‌తో పని చేయాలని అనుకుంటున్నట్లు ఆమిర్‌ చెప్పాడు. ఒకవేళ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే మాత్రం అది సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుందనడంలో సందేహం లేదు.

Priya Anand desires to marry Nithyananda Swamy!

only a true senior ntr fan can win this quiz!