సెంటిమెంట్ తో, లాజిక్ తో సంబంధం లేకుండా కొన్ని విషయాలు యాదృశ్చికం గ జరిగిపోతుంటాయి, దీనినే ఇంగ్లీషోడు “యాక్సిడెంట్” అన్నాడు . అటువంటి యాక్సిడెంట్ న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది, అది మంచి విషయమే కాబట్టి చెప్పటంలో తప్పు లేదనే ఇక్కడ ఆ విషయం ప్రస్తావించటం జరుగుతుంది. అదేమిటో గాని ఈ మధ్య కాలం లో చిరంజీవి గారి సరసన నటించిన హీరోయిన్లకు వెంటనే పెళ్లి అయిపోతుంది, మరీ అప్ కమింగ్ హీరోయిన్లు అయితే కాదు సుమండీ, కొంచెం సీనియర్ నటీమణులకు మాత్రమే. చిరంజీవి గారి కం బ్యాక్ మూవీ “ఖైదీ నెంబర్ 150 ” లో చిరంజీవి గారి సరసన హీరోయిన్ గ నటించిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత ” ఆచార్య” చిత్రంలో కూడా జత కట్టింది, ఆ చిత్రం సెట్స్ మీద ఉండగానే ఆమె పెళ్లి అయిపొయింది, ఆచార్య రిలీజ్ టైం కి ఆమె ఒక బిడ్డ తల్లి కూడా అయిపొయింది.
ఇప్పుడు నయనతార వంతు వచ్చింది, చిరంజీవి హీరోగా నటిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రంలో నయనతార హీరోయిన్, చిత్రం కమిట్ అయిన కొద్ది రోజులకు లాంగ్ పెండింగ్ లవ్ స్టోరీ లో ఒక చిన్న కామ, విఘ్నేష్ తో నిశ్చితార్ధం జరిగింది, గాడ్ ఫాదర్ చిత్రం సెట్స్ పైన ఉండగానే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, సో లవ్ స్టోరీ కి ఫుల్ స్టాప్ పెట్టి మారీడ్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోతున్నారు. ఇలా ఇద్దరు మిస్సులు, మిస్సెస్సులు అయిపోవటం తో , ఇప్పుడు అందరి చూపు, చిరంజీవి గారి సరసన “భోళా శంకర్” చిత్రంలో నటిస్తున్న తమన్నా మీద పడింది, ఈ సినిమా పూర్తి అయ్యేలోపు తమన్నా భాటియా ఇంటి పేరు మారుతుందేమో అని అందరు ఎదురు చూస్తున్నారు, తధాస్తు!!! అనటం కంటే మనం ఇంకేమి అన గలం చెప్పండి,ఒక మంచి విషయం జరుగుతుంటే కాదనడానికి మనం ఎవరం చెప్పండి.