in

WHO IS THIS “GHATTAMMA” ?

చిరంజీవి గారు, కొరటాల శివ డైరెక్షన్ లో నటించిన చిత్రం “ఆచార్య”, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా కొన్ని అరుదయిన కంబినేషనలు ఈ చిత్రంలో చోటు చేసుకున్నాయి. రాంచరణ్ గారు ఈ చిత్రంలో చిరంజీవి గారితో కలసి నటించటం, మణి శర్మ సంగీతం అందించటం వంటివి, ఆ కోవలోనే ఇంకొక ఇంటరెస్టింగ్ కాంబినేషన్ “ఘట్టమ్మ” పాత్ర పోషించిన నటి. ఆమె రెగ్యులర్ నటి కాదు అయినా ఆమె నటన తో ప్రేక్షకులను ఆకర్షించింది. “ఘట్టమ్మ” అనే పాత్రలో నటించిన అమ్మాయి పేరు శృతి, వృత్తి రీత్యా ఆమె ఒక సింగర్, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఆమె సూపర్ హిట్ పాటలు పాడింది.

శృతి “అఖండ” చిత్రంలో కూడా అడిగా అనే పాటను పాడటం జరిగింది. చిన్నపటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన ఆమె చిరంజీవి గారికి వీర ఫ్యాన్. తన అభిమాన నటుడు చిరంజీవి గారి తో ఒక్క సీన్ లో అయినా తెర మీద కనిపించాలి అనే కోరిక తో కొరటాల శివ గారిని అడగటం, ఆయన శృతి కి మంచి రోల్ ఇచ్చి ప్రోత్సహించారు. ఇదే కాకా ఆమెకు నటన పై కొంత ఆసక్తి ఉండటం కూడా ఆమెకు కలసి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివ గారికి ఆమె కృతజ్ఞతలు తెలియ చేసుకుంది.

Prabhas sister Praseeda has Worst experience with Swiggy!

Samantha’s Malayalam debut or Vidya Balan’s comeback?