in

jathi ratnam beauty to make her kollywood entry!

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో తొలి అడుగు వేసింది ఫ‌రియా అబ్దుల్లా. అందం, అమాయ‌క‌త్వం క‌ల‌గ‌ల‌సిన చిట్టి అనే అమ్మాయిగా సినిమాలో చ‌క్క‌టి న‌ట‌న‌తో మెప్పించింది. మొద‌టి సినిమాతోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్న ఆమెకు తెలుగు, త‌మిళ భాష‌ల నుంచి ప‌లు అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. ఈ స‌క్సెస్‌ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న ఫరియా అబ్దుల్లా సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తోంది. ఇటీవ‌లే బంగార్రాజు సినిమాలో నాగ‌చైత‌న్య‌తో ప్ర‌త్యేక‌గీతంలో ఆడిపాడింది.

తాజాగా ఆమె త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. విజ‌య్ ఆంటోనీ క‌థానాయ‌కుడిగా సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వాలిమ‌యిల్ పేరుతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొందుతోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా  ఎంపికైంది. తొలి చిత్రానికి భిన్నంగా ఇందులో ఛాలెంజింగ్‌గా ఆమె క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. ఇందులో ఫరియా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

Bhala Thandhanana!

Kiara Advani purposefully rejecting remakes!