విప్లవ నటుడు, విప్లవ చలన చిత్రాల ఆద్యుడు అయిన మాదాల రంగా రావు గారు నిర్మించిన ” ఎర్ర మల్లెలు” చిత్రంలోని ” నాంపల్లి టేషన్ కాడి ” పాట గుర్తుందా? అప్పట్లో ఆ పాట ఒక ఊపు ఊపేసింది ఆ పాటలో నటించిన కుర్రవాడు ఎవరో తెలుసా?. ఎర్ర మల్లెలు చిత్రం నిర్మాణ సమయం లో ఇంట్లో “నాంపల్లి టేషన్” పాట పెడితే వింటూ రెచ్చిపోయి డాన్స్ చేస్తుండే వాడు ఒక బుడతడు, ఆ డాన్స్ నచ్చిన రంగా రావు గారు అతని చేతే ఆ పాటలో డాన్స్ చేయించారు.
డాన్స్ మాస్టర్ లేకుండా ఆ పాటను ఒక్క రోజులో చిత్రీకరించటం జరిగింది. ఇంతకీ ఆ పాటలో నటించింది ఎవరనే కదా మీ డౌట్? మాదాల రంగా రావు గారి వారసుడు, ఇప్పటి డాక్టర్ మాదాల రవి చంద్. డాక్టర్ గ ప్రజా సేవ చేస్తూనే 2003 లో ” నేను సైతం” అనే చిత్రం నిర్మించి నటించటం జరిగింది. ఈ ఎర్ర బిడ్డ తండ్రి బాటలో నడుస్తూ, పెద్దగా సినిమాలు చేయకపోయినా, పీపుల్స్ హాస్పిటల్ స్థాపించి ఉచితం గ సేవ చేస్తున్నారు మాదాల రవి చంద్.