in

N.T.R SLAPPED HARI KRISHNA!

రికృష్ణ చెంప పగులగొట్టిన యెన్.టి.ఆర్., చైతన్య రధ సారధి, యెన్.టి.ఆర్. ఎదురుగా నిలబడి ధైర్యంగా మాట్లాడ గలిగిన హరికృష్ణను యెన్.టి.ఆర్.ఎందుకు కొట్టారు? యెన్.టి.ఆర్ దర్శకత్వం వహించి, నటించిన చిత్రం “తల్లా పెళ్ళామా”, 1970 లో వచ్చిన ఈ చిత్రం లో హరికృష్ణ బాల నటుడు గ నటించారు, ఈ చిత్రంలో మనవడు (హరికృష్ణ) చేతుల్లో నాయనమ్మ చనిపోతుంది, ఆ సీన్ లో హరి కృష్ణ ఏడుస్తూ నటించాలి, యెన్.టి.ఆర్ ఎంత చెప్పిన హరికృష్ణ కు ఏడుపు రావటం లేదు. మా నాయనమ్మ ఇంటి దగ్గర హాయిగా ఉంది నేను ఎందుకు ఏడవాలి అని మొండికి వేసారట. ఆ రోజు మనవడి నటన చూడటానికి వచ్చిన యెన్.టి.ఆర్. తండ్రి, లక్ష్మయ్య చౌదరి గారు కూడా సెట్ లోనే ఉన్నారట. యెన్.టి.ఆర్. తన సోదరుడు త్రివిక్రమ రావు ను పిలిచి..

తండ్రి గారిని కాసేపు బయటకు తీసుకొని వెళ్ళమని చెప్పి, వారు వెళ్లిన తరువాత మళ్ళీ యాక్షన్ అంటూ అరిచారట, అయినా హరి కృష్ణ లో చలనం లేదు, ఇక లాభం లేదు అనుకొన్న యెన్.టి.ఆర్. హరికృష్ణ దగ్గరకు వెళ్లి చెంప మీద ఒక్కటి పీకారట, దెబ్బకి హరి కృష్ణ ఏడుపు లంఖించుకున్నారట, వెంటనే కెమెరా రోల్ అన్న యెన్.టి.ఆర్ , హరి కృష్ణ ఏడుస్తుండగా, ఆ సీన్ కంప్లీట్ చేశారట. తాత ముందు మనవడిని కొడితే ఒప్పుకోరు అని తండ్రిని బయటకు పంపించి, తనకు కావలసిన సీన్ ఆ విధంగా చిత్రీకరించారు యెన్.టి.ఆర్. ఈ విషయాన్ని హరికృష్ణ గారే చాలా సందర్భాలలో చెప్తూ ఉండే వారు. తల్లా పెళ్ళామా చిత్రానికి దర్సకత్వమే కాదు, కధ కూడా యెన్.టి.ఆర్. అందించారు, బెస్ట్ రైటర్ అవార్డు కూడా అందుకున్న ఏకైక హీరో యెన్.టి.ఆర్..!!

animal beauty Tripti Dimri special song in ‘Pushpa 2′?

desperate pooja hegde gets a golden chance!