విశేషం ఏమంటే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో కీర్తి సురేశ్ అభిమానులు మూవీ రిలీజ్ ఎప్పుడంటూ నిర్మాతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కీర్తి డైహార్డ్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న నిర్మాత,
ఎంపిక చేసిన యాభై మంది అభిమానులకు..ఈ సినిమాను తన ఎడిట్ రూమ్ లో చూపించాలనే నిర్ణయానికి వచ్చారట. ఓ అభిమానికి సోషల్ మీడియా ద్వారా ఆయన అదే సమాధానం చెప్పారు. దాంతో కీర్తి సురేశ్ ఫ్యాన్స్ సినిమా చూసేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవడం ప్రారంభించారట. వీరికి ఈ సినిమా ఎప్పుడు చూపిస్తారో తెలియదు కానీ..అదే జరిగితే నిర్మాతకు ఓ రకంగా మూవీకి సంబంధించిన గుడ్ ఫీడ్ బ్యాక్ కూడా లభించినట్టు అవుతుంది.