in

TOP 10 best SONGS released during this pandemic!

10. MAGUVA MAGUVA – VAKEEL SAAB

వన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలోని మగువా మగువా.. నీ సహనానికి సరిహద్దులు కనవా అంటూ సాగే అద్భుతమైన పాట చాలా రోజుల పాటు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అయింది. థమన్ స్వరపరిచిన ఈ పాటను ఇప్పటి వరకూ 52 మిలియన్ల మంది చూసారు. 2020 టాప్ సాంగ్స్‌లో కూడా ఇది కూడా ఉంది..స్త్రీ ల గురించి పాట రూపంలో గొప్పగా చెప్పిన ఈ సాంగ్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది..

09. LAHE LAHE – ACHARYA

మెగాస్టార్ చిరంజీవి అంటే బహుశా మణిశర్మకు పూనకం వస్తుందేమో. చాలా కాలం తర్వాత మణిశర్మ, చిరంజీవి కాంబోలో వస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. ఆ మధ్యన విడుదల చేసిన ‘లాహే లాహే’ అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. శివ పార్వతుల మధ్య రొమాన్స్ ని వర్ణిస్తూ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇప్పటికే ఈ సాంగ్ 59 మిలియన్ వ్యూస్ సాధించింది.

08. BALEGUNDI BALA – SRIKARAM

ర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం శ్రీకారం. ఈ ఏడాది విడుదలై పర్వాలేదనిపించుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్ ఓకె అనిపించుకున్నాయి. అయితే ఈ చిత్రంలో వాడుకున్న ఫోక్ సాంగ్ ‘భలేగుంది బాల’ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో 72 మిలియన్ల వ్యూస్ తో కొనసాగుతోంది. అయితే ఈ సాంగ్ ని కొన్ని నెలల క్రితమే విడుదల చేశారు..సాంగ్స్ మ్యూజిక్ ఆకట్టుకున్న..సినిమా మాత్రం శర్వా కు నిరాశ పరిచింది

07. CHITTI NE NAVVANTE – JATHI RATNALU

జాతి రత్నాలు అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కావలసిన పూర్తి స్థాయి వినోదం అందించింది. మ్యూజిక్ విషయానికి వస్తే రధాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మధ్య సాగే లవ్ ట్రాక్ సాంగ్ ‘చిట్టి’ సూపర్ హిట్ గా నిలిచింది. చిట్టి అనగానే ది రోబోట్ అంటూ రజిని గుర్తుకు వస్తారు. ఈ చిట్టి సాంగ్ కూడా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. 73 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ కోసం రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ గమ్మత్తుగా ఉంటాయి.

06. JALA JALAPATHAM – UPPENA

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డెబ్యూ హీరో చిత్రాలలో రికార్డ్ మూవీగా నిలిచింది. దేవిశ్రీ అందించిన పాటలు ఈ చిత్రాన్ని మరో లెవల్ కు చేర్చాయి. అన్ని పాటలు ఆకట్టుకోగా మరీ ముఖ్యంగా ‘జలపాతం’ అనే సాంగ్ ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. 75 మిలియన్ వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతోంది.

05. KAATUKA KANULE – AKASHAM NE HADDURA

బ్బింగ్ పాటలకు ఆదరణ దక్కడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ సూర్య హీరోగా వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమాలోని ఓ పాట మాత్రం ఇప్పుడు మార్మోగిపోతుంది. కాటుక కనులే కరిగిపోయే పిలడా నిను చూసి అంటూ సాగే పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట తెలుగులో కూడా దుమ్ము దులిపేసింది. ఇప్పటికే 94 మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంది ఈ పాట..సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..

04. OKE OKA LOKAM NUVVE – SASHI

యంగ్ హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన చిత్రం శశి. సినిమా నిరాశపరిచినప్పటికీ ఈ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ అనే సాంగ్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ సాంగ్ లిరికల్ వీడియో 123 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. తన సమ్మోహనమైన గాత్రంతో సిద్ శ్రీరామ్ పాడిన మరో సూపర్ హిట్ సాంగ్ ఇది. అరుణ్ సంగీత దర్శకుడు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు..అది కెరీర్ మొత్తం లోనే ఇది బెస్ట్ సాంగ్ అని ఈజీ గా చెప్పవచ్చు..

03. NE KALLU NEELI SAMUDRAM – UPPENA

నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’ సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది..ప్రతీ ఒక్క ప్రేమజంటను మైమపరిపిస్తున్న ఈ సాంగ్‌ మరో రికార్డును అందుకుంది. తాజాగా ఈ వీడియో యూట్యూబ్‌లో 217 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అతితక్కువ సమయంలో 50 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన పాటగా ‘నీ కన్ను నీలి సముద్రం’ రికార్డు సృష్టించింది.

02. SARANGA DHARIYA – LOVE STORY

వ్ స్టోరీ.. ఇటీవల ఈ చిత్రంలో ‘సారంగ దరియా’ అనే ఫోక్ స్టైల్ లో సాగే పాటని రిలీజ్ చేశారు. కొన్ని రోజుల్లోనే యూట్యూబ్ లో సునామీ మొదలైంది. ఈ సాంగ్ విడుదలైన మూడు నెలల్లోనే యూట్యూబ్ లో 254 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మంచి బీట్ తో సాగే పాట ఒకెత్తయితే.. కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టేలా సాయి పల్లవి డాన్స్ మరో ఎత్తు. దీనికి తోడు మంగ్లీ మ్యాజిక్ వాయిస్.. ఇక సునామి రాకుండా ఎలా ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.

01. NEELI NEELI AKASHAM – 30 ROJULLO PREMINCHADAM ELA

యాంకర్ ప్రదీప్ హీరోగా మారిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ఈ సినిమా రిలీస్ అయినట్లు కూడా చాలా మందికి ముందు తెలియదు. కానీ ఒక్క పాటతో సినిమాలో అందరికి గుర్తుంది. నీలినీలి ఆకాశం అంటూ అమృత అయ్యర్‌తో కలిసి ప్రదీప్ పాడుకున్న పాట రికార్డులు తిరగరాసింది. విడుదలకు ముందే 259 మిలియన్స్ దాటిన తొలిపాట ఇదే. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్, సునీత పాడారు..

keerthy suresh ‘good luck sakhi’ special show for diehard fans!

andhala rakshasi to launch an eco-friendly Cafe in Dehradun!