in

fidaa beauty refused to star opposite Bellamkonda!

మలయాళ కుట్టి సాయిపల్లవి సినిమాల ఎంపికలో ఎంత సెలెక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పాత్ర, కథ నచ్చకపోతే అది ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా తిరస్కరించేస్తుంటుంది. ఇలా ఆమె వదులుకున్న పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ నుంచి కూడా సాయిపల్లవి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ సినిమాను వదులుకోవడానికి కారణం పాత్ర, కథ నచ్చక కాదు. డేట్లు సర్దుబాటు చేయలేక.

ఇదిలా ఉంటే తాజాగా సాయిపల్లవి మరో సినిమాను తిరస్కరించినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో నటించబోయే తొలి చిత్రం అయిన ‘ఛత్రపతి’ రీమేక్‌కు సాయిపల్లవి నో చెప్పిందట. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిని ఎంచుకోవాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ శ్రీనివాస్ సరసన నటించడానికి కియారా అద్వానీ సహా కొందరు హీరోయిన్లు నో అనేశారు. సాయిపల్లవిని ఈ సినిమా కోసం అడిగితే ఆమె కుడా నో అనేసిందంటూ వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu To Turn Cricket Coach For Anil Ravipudi’s Film?

anushka shetty’s decision worrying her producers!