in

kannada beauty saptami gowda bags a mega offer!

kannada beauty saptami gowda bags a mega offer!

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అవుతున్నాడు. తేజ్ హీరోగా ‘సంబ‌రాల ఏటి గ‌ట్టు’ సినిమా రెడీ అవుతోంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ఈలోగా మ‌రో సినిమాకు ప‌చ్చ జెండా ఊపాడు. సేవ్ ద టైగ‌ర్స్ ఫేమ్ తేజ కాక‌మాను ద‌ర్శ‌క‌త్వంలో, ఏకేఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరో. ఇటీవ‌లే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది..

ఈ చిత్రంలో హీరోయిన్ గా స‌ప్త‌మి గౌడ‌ని ఎంచుకొన్నారు. స‌ప్త‌మికి ఇది రెండో తెలుగు సినిమా. ఇది వ‌ర‌కు ‘త‌మ్ముడు’ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఆ త‌ర‌వాత ఓ తెలుగు సినిమా ఒప్పుకోవ‌డం ఇదే తొలిసారి. అట‌వీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. పులి పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. CG వ‌ర్క్ కూడా భారీ స్థాయిలో అవ‌స‌ర‌మైన సినిమా ఇది. పులికి సంబంధించిన సీన్లు ప్రీ విజువ‌లైజేష‌న్ చేశారు. ప్రీ ప్రొడక్ష‌న్ చాలా ప‌క‌డ్బందీగా చేసి, ఆ త‌ర‌వాతే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది..!!

dhurandhar lady sara arjun in Ram Charan’s RC17?

Ranabaali