క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆ మధ్య సురేఖావాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. . తాజాగా సురేఖావాణి ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న అలీతో సరదాగా అనే టాక్ షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాదానాలు చెబుతూ తన పెళ్లి విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ షోకు సురేఖా వాణి మరో సీనియర్ నటి రజితతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అలీ రెండో పెళ్లి గురించి ప్రశ్నించగా సురేఖావాణి తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేశారు. తాను చేసుకోబోయే వ్యక్తి ఎవరో కూడా మీరే చెప్పాలని సురేఖావాణి తన రెండోపెళ్లి గురించి ప్రచారం చేసేవాళ్లను ప్రశ్నించారు. ఒక వేళా తాను రెండో పెళ్లి చేసుకుంటే డబ్బున్న వాడినే చేసుకుంటానని వ్యంగ్యంగా తెలిపారు. రక్తం గడ్డ కట్టడంతో తన భర్త చనిపోయారని భావోద్వేగం చెందుతూ తెలిపారు. ఈ విషయంలో నన్ను నా కూతురుని బ్లేమ్ చేశారని.. ఆపదలో ఉన్నప్పుడు భర్త తరుపునుంచి ఎవరు రాలేదని అన్నారు.