in

krack jayamma to play crucial role in balayya’s next!

టసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది. హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా మొదలవనుంది. కాగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మీ ఇదివరకే గోపిచంద్ దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాలో లేడీ విలన్ గా మెప్పించింది. రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలోను లాయర్‌గా వరలక్ష్మీ ఆకట్టుకుంది. తాజాగా బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో వరలక్ష్మీ ఓ ప్రత్యేక పాత్రలో నటించనుందని సమాచారం..

Disturbed charmee announces break to social media!

ghanudu balu mahendra chetha port FOLIO PHOTOS theeinchukunna gatikudu sethupathi!