in

ghanudu balu mahendra chetha port FOLIO PHOTOS theeinchukunna gatikudu sethupathi!

భారతీయ సినీ రంగం లో మంచి పేరున్న డైరెక్టర్ కం సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర గారు, అటువంటి ఘనుడి చేత పోర్ట్ ఫోలియో ఫోటో లు తీయించుకున్న ఘటికుడు విజయ్ సేతుపతి. సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టక ముందు, పట్టు వదలని విక్రమార్కుడిలా బాలు మహేంద్ర ఇంటి చుట్టూ తిరిగిన సేతుపతి కి చివరికి ఆయన దర్శనం కలిగింది, నేను ప్రస్తుతం సినిమాలు ఏమి చేయటంలేదు, నువ్వు సినిమా ఛాన్స్ కోసం వచ్చిఉంటే కొంతకాలం తరువాత కలవమన్నారట బాలు మహేంద్ర. నేను అవకాశం కోసం రాలేదని,

నటుడిగా ప్రయత్నం చేయటానికి తన వద్ద మంచి పోర్ట్ ఫోలియో ఫోటోలు లేవని , మీరు మంచి ఫోటో గ్రాఫర్ కదా, నాకు కొన్ని పోర్ట్ ఫోలియో ఫొటోస్ తీసి పెట్టమని అడిగారట సేతుపతి. ఆ మాట విన్న బాలు మహేంద్ర గారు పెద్దగా నవ్వేసి, నన్ను ఇంత వరకు ఎవరు ఇలా అడగలేదు అని అంటూనే .తన కెమెరా రెడీ చేసుకొని రక, రకాల యాంగిల్స్ లో సేతుపతి ఫొటోస్ తీసి, ఆ ప్రింట్స్ ను సేతుపతికి ఇస్తూ ” నేను చూసిన మంచి ఫొటోజెనిక్ ఫేసులలో నీది ఒకటి, మంచి నటుడివి అవుతావు ” అని భుజం తట్టారట. అంతే ఆంజనేయుడికి, రాముడి ఆశీర్వాదం లభించినట్లు భావించిన విజయ్ సేతుపతి తన సినీ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

krack jayamma to play crucial role in balayya’s next!

can you Guess The Ages Of These Popular telugu Actors!