in

One More Record In tollywood beauty Samantha’s Account!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని ఓ బేబీ తర్వాత సినిమాల్లో నటించలేదు. మధ్యలో కోవిడ్‌ ప్రభావం కూడా తోడు కావడంతో సమంత వెండితెరపై అభిమానులను మెప్పించలేదు. అయితే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు సమంత. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె షేర్‌ చేస్తూ వస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారం క్రితమే సమంతను ఫాలో అయ్యేవారి సంఖ్య 15 మిలియన్స్‌కు చేరకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత ఇన్‌స్టాలో మరో మార్క్‌ను రీచ్‌ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు సమంత అక్కినేని. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా తెలియజేస్తూ అభిమానులకు థాంక్స్‌ చెప్పారు. ప్రస్తుతం సమంత గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ చిత్రంలో శకుంతల పాత్రధారిలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది.

mega brother Nagababu said OK to second marriage!

Rajinikanth to be honoured with 51st Dadasaheb Phalke Award!