in

Puri Jagannadh ‘Romantic’ choosing OTT platform!

స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తోన్న సినిమా ‘రొమాంటిక్’. బాలీవుడ్ హాట్ కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ  మూవీకి  పూరి జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ మూవీని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరి, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ నటిస్తున్నారు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నారు. జూన్ 18న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుద‌ల చేయాలని భావించారు.. తాజా సమాచారం మేరకు రొమాంటిక్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది. రొమాంటిక్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుంచి అదిరిపోయే డీల్ కుదిరిందని టాక్ నడుస్తోంది.

Comedian Sudhakar’s son Benny enters Tollywood!

Prabhas buys new luxury car worth Rs 6 crore!