in

Prabhas buys new luxury car worth Rs 6 crore!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం​ వరుసగా భారీ ప్రాజెక్ట్స్​కు గ్రీన్​సిగ్నల్ ఇస్తూ, వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన ‘సలార్’​తో పాటు ‘రాధేశ్యామ్​’, ‘ఆదిపురుష్’​, నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు పాన్‌ ఇండియా మార్గంలో వెళ్తున్నాడు. ఇదిలావుంటే, తాజాగా ప్రభాస్ ఓ ఖరీదైన కారును సొంతం చేసుకున్నాడు. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రభాస్‌కు ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌ కార్లు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారు చేరింది. ఈ కారు నిన్న రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి..

Puri Jagannadh ‘Romantic’ choosing OTT platform!

Vishwak Sen reveals exact reason behind leaving HIT 2!