సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో తారలు ముచ్చటించడం ఇటీవల సాధారణ జరుగుతున్న విషయం. అయితే ఇలా ముచ్చుటిస్తుండగా కొంత మంది తుంటరోళ్లు చేసే కామెంట్లు, వేసే ప్రశ్నలు తారలను సడెన్ షాక్ కు గురి చేస్తుంటాయి. అచ్చం అలాంటిదే జరిగింది బాలీవుడ్ బ్యూటీ జ్వానీ కపూర్ కు. జ్వానీ కపూర్ తాజాగా నటిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ సందర్భంగా ఆదివారం ఆమె అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో ముచ్చటించారు. అభిమానులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తనకు సంబంధించిన పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు. అందులో భాగంగా ఓ అభిమాని ‘నాకు ముద్దిస్తావా?’ అని అడిగాడు. దీంతో ఆ ప్రశ్నకు తగ్గట్టే ఆమె దిమ్మతిరిగిపోయే జవాబిచ్చింది. మొహానికి మాస్క్ పెట్టుకుని తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసి ‘నో’ అని సమాధానం చెప్పింది.