నవల కధానాయకి వాణిశ్రీ గారు వెండి తెర మీద ఎన్నో, ఆత్మ గౌరవం కలిగిన పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు, నిజ జీవితం లో కూడా ఆమె తన ఆత్మ గౌరవం చాటుకున్న ఒక సంఘటన జరిగింది. 40 సంవత్సరాల క్రితం తెలుగు లో కొన్ని గాసిప్ పత్రికలు ఉండేవి వాటి పని ఏమిటంటే సినిమా వాళ్ళ మీద ఉన్నవి, లేనివి,వ్రాసి సొమ్ము చేసుకోవటం. అప్పట్లో నెల్లూరు నుంచి వచ్చే ” బొగ్గుశ్రీ” అనే గాసిప్ పత్రిక ఒకింత ముందుకు వెళ్లి హీరోయిన్స్ గురించి అస్లీలమయిన వార్తలు వ్రాసే వారు, అందులో వాణిశ్రీ గురించి చాల సార్లు గాసిప్ వ్రాయటం జరిగింది, ఒక సారి వాణిశ్రీ గారి, అక్క, మరియు అమ్మ గారి గురించి కూడా చెడ్డ గ వ్రాయటం జరిగింది.
ఆ తరువాత ఆ పత్రిక విలేఖరి వాణిశ్రీ గారికి ఫోన్ చేసి మీ గురించి చెడ్డగా వ్రాయకుండా ఉండాలంటే 50 వేలు ఇవ్వమని డిమాండ్ చేసాడు, అలాగే ఇస్తాను రమ్మని చెప్పారు వాణిశ్రీ, మరుసటి రోజు షూటింగ్ స్పాట్ కు వచ్చిన విలేఖరిని పిలిచి, గట్టిగ మందలించే ప్రయత్నం చేసారు, కానీ ఆ విలేఖరి వ్రాస్తాను ఏమి చేస్తావు అని దురుసుగా మాట్లాడే సరికి వళ్ళుమండిన వాణిశ్రీ గారు, కాలి చెప్పు తీసి వాడి రెండు చెంపలు వాయించేసారు, నన్ను చంపేస్తుంది కాపాడండి అంటూ కేకలు పెట్టె సరికి యూనిట్ సభ్యులు వచ్చి కాపాడారు. ” బొగ్గుశ్రీ” విలేఖరి ముఖం బొగ్గు చేసి పడేసారు వాణిశ్రీ గారు. ఆ తరువాత ఎప్పుడు ఆమె గురించి చెడ్డగా వ్రాసే ధైర్యం చేయలేదు “బొగ్గుశ్రీ” పత్రిక.