in

Allu Arjun’s Pushpa announces release date!

ల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా పుష్ప. ఈ సినిమా మీద భయంకరమైన అంచనాలు వున్నాయి. అటవీ నేపథ్యంలో సుకుమార్ డిఫరెంట్ స్టోరీ తో రూపొందిస్తున్న సినిమా ఇది.ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూలు తరువాత హైదరాబాద్ షెడ్యూలు వుంటుంది. దాని తరువాత కేరళ షెడ్యూలు వుండే అవకాశం వుంది. ఇదిలా వుంటే అన్ని సినిమాలకు ముందుగా డేట్ లు బ్లాక్ చేస్తున్నట్లే పుష్ప సినిమాకు కూడా డేట్ బ్లాక్ చేస్తున్నారు.

ఆగస్టు 13న విడుదల అంటూ డేట్ ప్రకటిస్తున్నారు. అయితే ఆ టైమ్ కు రెడీ అవుతుందా? కాదా? అన్నది తెలియదు. పైగా సుకుమార్ సినిమా ఇంత ఫాస్ట్ గా సినిమాను రెడీ చేస్తారా? అన్నది అనుమానం. అయితే బన్నీ మాత్రం ఈ సినిమాను వీలయినంత ఫాస్ట్ గా రెడీ చేసి, కొరటాల శివ సినిమా మీదకు వెళ్లాలనే ఆలోచనలో వున్నారు. అందువల్ల సుకుమార్ కు ఓ డెడ్ లైన్ పెడితే తప్ప పని జరగదని ఇలా ప్రకటించేస్తున్నారేమో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

boney kapoor upset with rajamouli’s decision!

set lo kaali cheppulu theesi vilekari chempa pagalagottina vanisri!