in

Rana and Miheeka get 3D impressions of them holding hands!

కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ స‌మ‌యంలో కొద్ది మ‌ద్ది అతిథుల మ‌ధ్య రానా- మిహికా బ‌జాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పటినుండి వారిద్దరి స్వీట్ మూమెంట్స్ కు సంబంధించి ఫొటోలు అప్పుడప్పుడు వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంటారు. ఇక ఇప్పుడు తాజాగా వారికి సంబంధించిన మరో ఫొటో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.

హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన రానా మిహీకల గురించి సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో రానా మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ ఫోటో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ ఫొటోతో పాటు వారి బంధాన్ని కూడా ప్రశంసించింది. “మేం హ్యాండ్ ఇంప్రెషన్స్ కోసం రానా మిహీకను కలిసినప్పుడు వారిద్దరిని చూసినప్పుడు మెడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది. అలాగే మేం చేతి ముద్రలను తీసుకునే సమయంలో మాస్కులు ధరించాం. కానీ మేం కళ్లతో వారి ఆనందాన్ని చూసాం’ అంటూ పొగడ్తలు కురిపించింది.

anushka’s next with sundeep kishan’s flop director!

Heroine Chandini Chowdary cries on stage!