in

anushka’s next with sundeep kishan’s flop director!

మధ్య సినిమాల విషయంలో బాగా స్లో అయిందని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని భాగమతి చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సినిమా తర్వాత రెండేళ్లు విరామం తీసుకొని రీసెంట్ గా నిశ్శబ్దం సినిమా చేసింది. డిజిటల్ రిలీజ్ చేసిన ఈ మల్టీలాంగ్వేజ్ సినిమా కూడా అనుష్కకు ఎదురుదెబ్బ కొట్టింది. నిశ్శబ్దం కూడా బాక్సాఫీస్ ప్లాప్ గా నిలిచింది. ఎంతటి స్టార్ సినిమా ప్లాప్ పడేసరికి కిందికి పడిపోవాల్సిందే. కానీ అందరూ హీరోయిన్లు అలా ఉండరు.

తాజాగా అనుష్క తదుపరి సినిమా డైరెక్టర్ పి. మహేష్ తో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ కిషన్ హీరోగా ‘రారా కృష్ణయ్య’ సినిమా తీసిన మహేష్.. అనుష్కకి ఒక స్క్రిప్ట్ వినిపించాడట. ఆ స్క్రిప్ట్ కూడా అనుష్కకు బాగా నచ్చిందని.. ఇక త్వరలో ఆఫీసియల్ వార్త బయటికి రానుందని సమాచారం. అయితే రారా కృష్ణయ్య తర్వాత మరో సినిమా చేయలేదు మహేష్. అలాగే రారా కృష్ణయ్య కూడా ప్లాప్ అయింది. మరి ఇటువైపు అనుష్క కూడా ప్లాప్ లలో ఉంది.

HERE IS THE BEST TELUGU MULTI STARRER POSTER OF HOBBS AND SHAW TELUGUSWAG EDITS

Rana and Miheeka get 3D impressions of them holding hands!