in

career lo oke okasari negitive role chesina super star krishna!

దాదాపుగా తెలుగు హీరోలు అందరు ఏదో ఒక స్థాయి లో నెగటివ్ పాత్రలు చేసిన వారే ఎవరో ఒకరు,ఇద్దరు తప్ప. అదే క్రమం లో 350 చిత్రాలు నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఒక చిత్రంలో నెగటివ్ రోల్ చేసారు.విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రైవేట్ మాస్టర్ అనే చిత్రంలో కృష్ణ గారు నెగటివ్ రోల్ చేసారు. అందులో రామ్ మోహన్ హీరో గ నటించగా కృష్ణ గారు నెగటివ్ రోల్ చేసారు. అప్పటికే కృష్ణ గారు హీరో గ 9 చిత్రాలు నటించారు. విశ్వనాధ్ గారి మీద ఉన్న గౌరవం తో ఆ పాత్ర చేశారట.

తన మొదటి చిత్రం తేనే మనసులు లో తనకు డైలాగ్స్ అండ్ యాక్టింగ్ నేర్పించిన వారు విశ్వనాధ్ గారే, ఆ తరువాత విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో 3 చిత్రాలలో హీరో గ నటించారు, ప్రైవేట్ మాస్టర్ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేసారు. కృష్ణ గారు, విస్వనాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు 4 మాత్రమే. కృష్ణ గారు యాక్షన్ హీరోగా దూసుకొని పోవటం, విశ్వనాధ్ గారు రొటీన్ సినిమా నుంచి దూరంగా సంగీత, నృత్య ప్రధాన చిత్రాలు తీయటం వలన మళ్ళీ వీరి కాంబినేషన్ కుదర లేదేమో..

pawan kalyan’s family sends Christmas gift to mahesh babu family!

Bigg Boss Sohel Bags A Hero Offer!