in

police jeep lo shooting ku vacchina balayya!

బాలయ్య బాబు కి దర్శకుల హీరో అని పేరు, ఒక క్యారెక్టర్ కమిట్ అయితే దాని కోసం చాల హోమ్ వర్క్ చేసి ఆ క్యారెక్టర్ లోకి పరకాయప్రవేశం చేస్తారు అని పేరు. బి. గోపాల్ గారి డైరేక్షన్ లో బాలయ్య నటించిన ” రౌడీ ఇన్స్పెక్టర్ ” చిత్రం అల్ టైం రికార్డు హిట్. పోలీస్ చిత్రాలకు అది ఒక ట్రెండ్ సెట్టర్ గ నిలిచింది, నిజమయిన పోలీస్ ఆఫీసర్ లాఠీ ఎలా పట్టుకుంటారు, జీప్ ఎలా ఎక్కుతారు, వారి నడక ఎలా ఉంటుంది అన్న అన్ని విషయాలు హోమ్ వర్క్ చేసి నటించారు బాలయ్య బాబు. కానీ ఆ చిత్రం షూటింగ్ సందర్భం గ తనకు జీప్ పంపితేనే షూటింగ్ కు వస్తాను అని మెలిక పెట్టారట బాలయ్య,

అదేమిటి బాలయ్య దర్శకుల నటుడు కదా అనుకొంటున్నారా? మరి అక్కడే ఉంది బాలయ్య బాబు కమిట్మెంట్ ఎలా ఉంటుంది అన్న విషయం. బాలయ్య ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేస్తున్న రోజుల్లో అయన ఇంటి నుంచే గెట్ అప్ లో బయలు దేరే వారు, షూటింగ్ స్పాట్ లో కూడా ఇన్స్పెక్టర్ లాగే ప్రవర్తించే వారు, అందుకే ఇంటి దగ్గర నుంచే పోలీస్ జీప్ లో బయలు దేరితే ఆ మూడ్ ఆలా మైంటైన్ చేయటానికి బాగుంటుంది అని, గోపాల్ గారిని తాను షూటింగ్ కి రావటానికి కార్ కాకుండా జీప్ పంపమని చెప్పారట. అది బాలయ్య కమిట్మెంట్ అంటే, అందుకే ఆ చిత్రంలో నటించినన్ని రోజులు బాలయ్య జీప్ లోనే షూటింగ్ కి వచ్చే వారట.

i never had crush on monal, says Abijeet!

avika gor to romance akkineni naga chaitanya!