in

anchor anasuya playing devadasi role?

నసూయ భరద్వాజ్..ప్రజంట్ తెలుగు బుల్లితెరపై మోస్ట్ బ్యూటీఫుల్ హోస్ట్ అన్న విషయం తెలిసిందే. వయసు పెరుగుతున్న కొద్దీ అనసూయ అందం కూడా రెట్టింపవుతుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఫేమ్ తెచ్చుకున్న ఈ స్టార్ యాంకర్, సినిమాల్లో కూడా నటిస్తూ అదరగొడుతుంది. ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఈ ముద్దుగుమ్మ నటనకు ఫిదా అయిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ.. తన తదుపరి సినిమా ‘రంగ మార్తండ’లో అవకాశం ఇచ్చారని సమాచారం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ, బ్రహ్మనందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘నటసామ్రాట్’ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఒరిజినల్ సినిమాలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ఒక స్పెషల్ రోల్ కోసం అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందని టాక్. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే పాత్రలో కనిపించనుందట. అంతేకాదు కథానుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నర్తించాల్సి ఉంటుందట. కృష్ణవంశీ పాత్రలను, పాటలను ఎలా డిజైన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

chitti babu ku thrutilo thappina pedda pramadham!

shraddha kapoor accepts prabhas challenge!