in

payal buying new house in hyderabad?

ప్రస్తుతం తెలుగు హీరోయిన్స్ చాల తక్కువ గా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇతర భాషల హీరోయిన్లతో మన దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. అయితే సదరు హీరోయిన్లు పుట్టి పెరిగిన స్థ‌లం, భాష‌తో సంబంధం లేకుండా బ‌హుభాషా చిత్రాల్లో న‌టిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. షూటింగ్ ల్లో పాల్గొనాల్సి వచ్చిన‌పుడు తాత్కాలికంగా అద్దెకు ఉండాల్సిన ప‌రిస్థితి వీరికి ఉంటుంది. దీంతో అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో సొంతంగా ఇళ్లు కొనుగోలు చేసుకుంటున్నారు. ముఖ్యమంగా చాలామంది హీరోయిన్స్ హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేస్తూ ఇక్కడి నుండి వెళ్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర హీరోయిన్లు కొనుగోలు చేయగా..తాజాగా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ సైతం హైదరాబాద్ లో ఓ ప్లాట్ కొనుగోలు చేసేందుకు సిద్దమైందట. హైద‌రాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి..కుటుంబాన్ని సిటీకి తీసుకురావాల‌ని ఫిక్స్ అయింద‌ట‌. త‌న‌కు అభిరుచుల‌కు అనుగుణంగా ఉండే ఫ్లాట్ ను వెతికే ప‌నిలో ఉన్న‌ట్టు టాక్‌

ott platform gives red signal to ram’s movie?

shriya about her character in ‘rrr’ movie!