in

shriya about her character in ‘rrr’ movie!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పిరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీలో ఎన్టీఆర్, చరణ్‌లు.. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ అందాల భామ అలియా భట్ నటిస్తున్నండగా, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తోంది. వీరితోపాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా శ్రియ శరన్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తాలపై తాజాగా స్పందించిన శ్రియ..

ఈ మూవీలో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో తాను అతిథి పాత్రలో నటిస్తున్నానని, ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో మళ్లీ పని చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. రాజమౌళికి గొప్ప విజన్ ఉందని, ఈ మూవీని ఆయన అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చెప్పింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ తో కలిసి పని చేస్తున్నానని, ఆయన ఒక గొప్ప నటుడని శ్రియ పేర్కొంది. ఈ మూవీలో తనకు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో ఎలాంటి స‌న్నివేశాలు లేవని చెప్పుకొచ్చింది శ్రియ. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేకపోవడంతో శ్రియ ఫ్రాన్స్ లో తన భర్త వద్ద ఉంటోంది.

payal buying new house in hyderabad?

sharwanand to romance aishwarya rajesh!