in

release date fixed for anushka’s ‘nishabdam’!

థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రిలీజ్ పెండింగ్లో ఉన్న సినిమాలను ఒక్కక్కటిగా ఓటిటిలో దింపడానికి రెడీ అవుతున్నారు ఆయా సినిమాల దర్శకనిర్మాతలు. ఇప్పటికే ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. ఈ సినిమాకి టాక్ మంచిగా రాకపోయినా.. పెట్టిన బడ్జెట్ అయితే నిర్మాతకు వచ్చేసింది. సినిమాని కూడా బాగానే చూస్తున్నారు.

ఈ క్రమంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న ‘నిశ్శబ్దం’ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో దింపడానికి రెడీ అయిపోయారట దర్శకనిర్మాతలు. అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 10న లేదా 17న ‘నిశ్శబ్దం’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..గ్రాఫిక్స్, సిజి వర్క్ పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని ఇప్పటి వరకూ ఓటిటిలో విడుదల చెయ్యలేదట. లేకపోతే ‘వి’ చిత్రం కంటే ముందే ‘నిశ్శబ్దం’ ఓటిటిలో దర్శనమిచ్చేదట..హేమంత్ మదుకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ మరియు ‘కొన ఫిలిం కార్పొరేషన్’ బ్యానర్ లు కలిసి నిర్మించాయి. మాధవన్, అంజలి,షాలినీ పాండే, సుబ్బరాజు వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

allu arjun’s icon did not stopped!

sai pallavi turns chiranjeevi’s sister!