in

allu arjun’s icon did not stopped!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ రెండు ప్రాజెక్ట్ లు కన్నా ముందే బన్నీ లైన్ లో ఉన్న మొదటి పాన్ ఇండియన్ చిత్రం “ఐకాన్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తో ప్లాన్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ తోనే బన్నీ మొదట పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఆ గ్యాప్ లో చాలా వరకు పరిస్థితులు మారిపోవడం మూలాన ఈ భారీ ప్రాజెక్ట్ ఆగాల్సి వచ్చింది.

దీనితో అనేక స్పెక్యులేషన్స్ ఈ చిత్రంపై మొదలయ్యాయి. దీనితో అసలు ఈ సినిమా ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినపుడు దానికి సమాధానంగా ఈ ప్రాజెక్ట్ ఆగలేదనే తెలుస్తుంది. బన్నీ ఇంకా ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తి గానే ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కాస్త లేట్ అయినా సరే పరిస్థితులు అనుకూలించగానే ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది అని తెలుస్తుంది. బన్నీ అభిమానులు ఈప్రాజెక్ట్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

nithin gifts car to his director!

release date fixed for anushka’s ‘nishabdam’!