జగపతి బాబు గారు , చాల సాఫ్ట్ అండ్ ఫ్రాంక్ పర్సన్, ఒక విధం గ చెప్పాలంటే జాలి గో గుడ్ మాన్ అని చెప్ప వచ్చు హీరో గ చాల కుటుంబ కధా చిత్రాలు చేసారు, మరో శోభన్ బాబు లాగా లేడీస్ ఫాలోయింగ్ ఉన్న ఒక సాఫ్ట్ హీరో. అటువంటి జగపతి బాబు గారు అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర నుంచి లేచి కూర్చొని బోరుమంటూ ఏడ్చేసే వారట. ఎందుకో తెలుసా ? సినిమాల పరంగా త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది, చేతిలో ఒక్క సినిమా లేదు, ఉన్న ప్రాపర్టీస్ కోల్పోయారు, అయినా ఆయన ఏ రోజు ఏడవలేదు. కానీ ఆయన ఎందుకు అంతగా ఏడ్చారో తెలుసా? హీరో గ తన కు ఫ్యూచర్ లేదు అనుకుంటున్న సమయం లో లెజెండ్ అనే సినిమా లో బాలయ్య బాబు కి అపోజిట్ గ ఒక అతి క్రూరమయిన విలన్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది.
జగపతి బాబు గారు ఆ క్యారెక్టర్ చేయటానికి డిసైడ్ అయి ఆ సినిమా షూటింగ్ లో చాల కసి గ ఆ రోల్ ఆక్ట్ చేసి ఇంటికెళ్లి నిద్రపోతూ ఉలిక్కిపడి లేచి, ఏంటి నేను ఇంత క్రూరంగా నటిస్తున్నాను, వ్యక్తిగతంగా నేను అటువంటి వాడిని కాదు అంటూ, లెజెండ్ లో తన క్యారెక్టర్ క్రూరత్వాన్ని తలచుకొని భోరున ఏడ్చేశారట. వ్యక్తిగతం గ చాల మంచి మనస్కుడయిన జగపతి బాబు గారు, లెజెండ్ లో తాను పోషించిన జితేంద్ర అనే పాత్రలోని క్రూరత్వం ఆయన్ని అంతగా కదిలించింది. ఆ క్యారెక్టర్ కి బెస్ట్ సపోర్టింగ్ ఆక్టర్ గ ఫిలింఫేర్ అవార్డు సౌత్ వచ్చింది జగపతి బాబు గారికి.దాని తరువాత తెలుగు చిత్రాలలో స్టైలిష్ విలన్, మరియు క్యారెక్టర్ యాక్టర్ గ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు జగపతి బాబు గారు.