in

Ramya Krishna reveals about Bollywood exit!

క్షిణాది భాషల్లో నటించి ప్రముఖ నటిగా వెలుగొందిన రమ్యకృష్ణ బాలీవుడ్‌లో మాత్రం రాణించలేకపోయారు. బాలీవుడ్‌లో తాను రాణించకపోవడానికి కారణం ఉందని ఆమె పేర్కొన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలితో ఉత్తర భారత్‌లో కూడా రమ్యకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె బాలీవుడ్‌లో ఖల్‌నాయక్, క్రిమినల్, బడేమియా చోటేమియా వంటి సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు. తాను బాలీవుడ్‌లో విజయవంతం కాలేకపోయానని..

తాను నటించిన సినిమాలు ఉత్తర భారత ప్రజల ఆదరణ పొందలేదని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో తనకు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు దూరమైనట్టు ఆమె పేర్కొన్నారు. అయితే దక్షిణాదిలో మంచి సినిమాలు చేశానని ఆమె చెప్పారు. రమ్యకృష్ణ ఒకప్పుడు దక్షిణాది అగ్రహీరోలతో నటించి స్టార్ హోదాను అనుభవించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో రమ్యకృష్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా మారారు.

ROJA IN CHIRU ‘LUCIFER’ REMAKE?

shreya comments on prabhas eyes!