టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అయితే అదంత ఒకప్పుడు..ఇప్పుడు తనవైపు ఎవరు అసలు చూడడం కూడా లేదట..ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు, బాలీవుడ్ లో కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి అని వార్తలు వస్తున్నాయి కానీ వాటిపైన కూడా సరైన క్లారిటీ లేదు..ఒక వైపు సినిమాలు లేక, మరోవైపు లాక్ డౌన్ ఉండడంతో.. ఇది సరైన టైం అని భావించి సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఈ పంజాబీ బేబీ.
ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటున్న రకుల్ తను రెగ్యులర్ గ జిం లో చేసే యోగా, వర్కౌట్‌లకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడానికి కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేసింది..అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనాపై పోరాటానికి పీఎం కేర్ ఫండ్స్‌కు అందించనున్నట్లు ఆమె తెలిపారు..అయితే, ఈ ఆన్లైన్ బిజినెస్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది, చాల మంది సెలెబ్రిటీలు తమ యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ ఫాన్స్ కు టచ్ లో ఉండడమే కాకుండా దాని ద్వారా వచ్చే వ్యూస్ మనీ కూడా సంపాదిస్తున్నారు.. ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ లో రకుల్ కూడా చేరిపోయింది.. దీని ద్వారా వచ్చే డబ్బులు చాల తక్కువే అయినప్పటికీ.. ఎంతో కొంత వెనకేసుకోవచ్చు కదా అని భావిస్తున్నారు కొందరు సెలబ్రిటీస్.