విశ్వక్ సేన్, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత తన రెండో సినిమా ‘ఫలక్ నామా దాస్’ తో ప్రొడ్యూసర్ గ కూడా మారి అందరిని ఆశ్చర్య పరిచాడు ఈ కుర్ర హీరో. తాజాగా నాని ప్రొడ్యూస్ చేసిన ‘హిట్’ సినిమాలో నటించి కెరీర్ లో తొలి హిట్ కొట్టాడు విశ్వక్ సేన్. తెర మీద చాల కోపిష్టి గ కనిపించే ఈ హీరో తెర వెనుక చాల స్మూత్ అండ్ రొమాంటిక్ అంటే నమ్ముతారా..నమ్మకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చదవాల్సిందే. విశ్వక్ సేన్ చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించడట, అదికూడా తన స్కూల్ డేస్ లోనే, ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు .
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి మనోడికంటే రెండేళ్లు సీనియర్, అంటే తను పదో తరగతి చదువుతుంది.తన ప్రేమ విషయం చెప్పకుండా ఇంకా లేట్ చేస్తే పరీక్షలు అయిపోయి తను స్కూల్ నుండి వెళ్ళిపోతుంది.. అని బావించాడో ఏమో కానీ వన్ ఫైన్ మార్నింగ్ తనకు ఐ లవ్ యు చెప్పేసాడు. ఇంకేం వుంది విషయం వాళ్ళ టీచర్‌కి తెలియడంతో ఇద్దర్నీ ఆఫీస్ రూంకి పిలిచారట. అక్కడే విశ్వక్ సేన్‌కి ఆ అమ్మాయితో రాఖీ కట్టించరట టీచర్. ఇంకా ఆ తరువాత విశ్వక్ ఎప్ప్పుడు తన జోలికి పోకుండా తన పనేదో తను చేసుకుంటూ బుద్ధిగా చదువుకున్నాడట.. అదండీ మన దాస్ గాడి ప్రేమాయణం, ఆరోజు టీచర్ అల చేసి ఉండకపోతే మనోడి లవ్ స్టోరీ హిట్ అయ్యేదేమో.