in

KRISHNA GARI INTLO SHOBHAN BABU GARI PHOTO!

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన ఫ్రెండ్స్ ఎవరు అంటే అందరూ ఇప్పటికి టక్కున చెప్పే సమాధానం.. నందమూరి తారక రామ రావు ఇంకా అక్కినేని నాగేశ్వర్ రావు గారు అని. వీరిద్దరూ తెరపై ఒకరిని మించి ఇంకోరు ఎంత పోటీ పడి నటించేవారో తెర వెనుక అంతే పోటీగా ఒకరిపై మరొకరు ప్రేమను చూపించుకునేవాళ్ళు..అయితే ఈ ఇద్దరు దిగ్గజాల తరువాత ఆ రేంజ్ లో స్నేహం చేసి సినీ రంగంలో రాణించిన జంట సూపర్ స్టార్ కృష్ణ ఇంకా నటభూషణ శోభన్ బాబు అని చెప్పాలి. కృష్ణ గారికి మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని సెక్షన్స్ అభిమానులు విపరీతంగా ఉండగా.. అందాల నటుడు శోభన్ బాబు గారు ఆరోజుల్లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడమే కాకుండా మంచి ఫ్యామిలీ హీరోగా కూడాగుర్తింపు సాధించారు.

ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో మల్టీస్టారర్ మూవీస్ లో నటించారు. మండే గుండెల, ముందడుగు, కృష్ణార్జునులు, మహా సంగ్రామం, ఇద్దరు దొంగలు, ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో కలిసి నటించి ‘ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ పార్టనర్స్’ గ అందరూ అనుకునేలా చేసారు.. ఇలా వీరిద్దరూ చేసిన మల్టీస్టారర్ మూవీస్ మరెవ్వరు చేయలేదనే చెప్పాలి. ఆరోజుల్లో శోభన్ బాబుని ప్రతి ఇంట్లో కొడుకుగా భావించేవారట. అంతెందుకు తన ఇంట్లో సూపర్ స్టార్ ఉన్న కానీ తన పెద్ద కొడుకు శోభన్ బాబు అనేవారట కృష్ణ తల్లి. అంతటి మంచి అభిప్రాయం శోభన్ బాబు మీద కృష్ణ గారి తల్లి నాగరత్నమ్మ కు ఉండేదట..అంతే కాకుండా ‘కురుక్షేత్రం’ సినిమాలో శోభన్ బాబు గారు వేసిన కృష్ణుడు వేషం చూసి నాగరత్నమ్మ గారు అప్పటినుంచి తన ఇంట్లో శోభన్ బాబు ఫోటో పెట్టుకున్నారట. దీనిబట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ఆరోజుల్లో కృష్ణ ఇంకా శోభన్ బాబు గారి స్నేహబంధం ఎలా ఉండేదో. వీరిద్దరి స్నేహం రానున్న కాలంలో మరెందరో హీరోలకు స్ఫూర్తి గ నిలుస్తుంది అని కచ్చితంగా చెప్పాలి..ఏమంటారు నిజమే కదా!!

SHRIYA CHALLENGE TO BUNNY!

HAPPY BIRTHDAY JAYAPRADHA!