అది 1977 సంవత్సరం, అప్పటికే యెన్.టి.ఆర్. దాన వీర సూర కర్ణ, అడవి రాముడు వంటి కోటి రూపాయలు వసూలు చేసిన చిత్ర విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు, వెంకటరత్నం అనే నిర్మాత డి.వీ.నరసరాజు గారు వ్రాసిన యమగోల స్టోరీ ని యెన్.టి.ఆర్. కు చెప్పి, బాలకృష్ణ మరియు యెన్.టి.ఆర్. కాల్షీట్స్ అడిగారు. అంటే హీరో రోల్ కి బాలకృష్ణ గారిని, యముడి క్యారెక్టర్ కి యెన్.టి.ఆర్. ని అనుకున్నారు. స్క్రిప్ట్ నచ్చిన పెద్దాయన హీరో క్యారెక్టర్ తానే చేస్తానన్నారు,అప్పటికి బాలయ్య బాబు దాన వీర సూర కర్ణ లో అభిమన్యుడిగా నటించి ఉన్నారు, అప్పుడే బాలకృష్ణ గారిని బయట చిత్రాలకు ఇవ్వదల్చుకోలేదు అని చెప్పారట. మరి యముడి క్యారెక్టర్ ఎవరు అని నిర్మాత, రచయిత ఇద్దరు తల పట్టుకొన్నారట. అదే మాట పెద్దాయన ముందుంచారు, యముడి గ సత్యనారాయణ గారిని తీసుకోండి అయనయితే నాకు సమఉజ్జి గ ఉంటారు అని చెప్పారట. ఆ విధంగా యమగోల చేసే అవకాశం బాలకృష్ణ గారు మిస్ అయ్యారు.ఆ తరువాత వెండి తేర యముడిగా సత్యనారాయణ గారు ఫిక్స్ అయిపోయారు. యమగోల ఎంత పెద్ద హిట్ మూవీ అనేది అందరికి తెలిసినదే, మరియు ఇంకొక కోటి రూపాయల చిత్రం, ఆ రోజుల్లో ఒక మూవీ కోటి రూపాయలు వసూలు చేయటం అంటే పెద్ద రికార్డు అనే చెప్పాలి. 1977 వ సంవత్సరం లో హ్యాట్రిక్ విక్టరీ కైవసం చేసుకున్న హీరో గ యెన్.టి.ఆర్. చరిత్ర సృష్టించారు..