in

NIDHI AGARWAL TO DO AN ITEM SONG !

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]‘రా[/qodef_dropcaps]

క్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందట.

కాగా ‘కందిరీగ’లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టే ఇందులో కూడా ఇద్దరు కథానాయికలు నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించనున్నారు. అలాగే అందులో ఒక కీ రోల్ చేసిన సోనూ సూద్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇక ఫైట్స్ సంగతి సరేసరి. అన్నీ హైఓల్టేజ్ పోరాటాలే. రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ హీరో గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నారు.

YAMAGOLA NUNDI BALAYYA NU THEESESINA NTR!

RAJASEKHAR SHOWS HIS GOODNESS!