
అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో రాబోతున్న సినిమా ‘రాకా’. తాజాగా, ఈ చిత్రంలో తెలుగు నటి ‘సిరి హనుమంతు’ అవకాశాన్ని దక్కించుకున్నారు. గతంలో ‘సీతా పయనం’లో కనిపించిన ఆమె, త్వరలో ‘చెన్నై లవ్ స్టోరీ’లోనూ కనిపించనున్నారు. ఐతే, అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రంలో ఆమె భాగం కానున్న విషయాన్ని నిర్మాత ఎస్.కె.ఎన్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ ప్రకటన ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ముంబైలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
కాగా ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.!!
