in

Allu Arjun and Atlee’s Raaka Creates World Record Pre-Release!

కాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘రాకా’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. విడుదలకు ముందే ఈ చిత్రం “మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్” (ఒకే సమయంలో అత్యధిక మందిని మోషన్ క్యాప్చర్ చేయడం) విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఘనత భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించిందని చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఒకేసారి 37 మంది పెర్ఫార్మర్లతో రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్‌ను ఏకకాలంలో చిత్రీకరించి ఈ ఘనత సాధించినట్లు తెలిపింది. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దర్శకుడు అట్లీ తన పుట్టినరోజు జరుపుకుంటున్న రోజే ఈ ప్రకటన రావడం విశేషం. ఈ సందర్భంగా అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్, ఆయనతో కలిసి మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు..!!

Shruti Haasan prayed ‘a thousand times’ that men get periods!

Kajal Aggarwal opens up on rising divorces and marital issues!