పాపులర్ టాలీవుడ్ యంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అషు రెడ్డితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. బిగ్‌బాస్ 3 లో పార్టిసిపేట్ చేసినప్పుడు అషుతో ఏర్పడ్డ పరిచయం, స్నేహంగా మారి ఆపై ప్రేమగా ముదరడంతో వీరిద్దరూ తమ రిలేషన్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు తామిద్దరం రియల్ రిలేషన్‌లో ఉన్నామని రాహుల్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
అషు రెడ్డితో రాహుల్ డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని అతడే తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ‘మేమిద్దరం సినిమా ప్రమోషన్ కోసమో.. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమో కలవలేదు. మేము నిజమైన రిలేషన్‌షిప్‌లో ఉన్నాం’ అంటూ ఇటీవల వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఎంగేజ్‌మెంట్ డ్రామా ఆడిన పునర్నవికి కౌంటర్ ఇచ్చాడు. రాహుల్ చేసిన పోస్టుపై అలీ రెజా కూడా స్పందించడం విశేషం.