in

Gopichand in Pawan Kalyan ‘Ayyappanum Koshiyum’ remake?

వర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ దూకుడు ప్రదర్శిస్తూ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు . ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ సినిమా సెట్స్‌పై ఉండగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు పవన్ అనౌన్స్‌ చేసారు. తాజాగా విజయదసమి రోజున మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ ను తెలుగులో పవన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇందులో మరో హీరోగా రానా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. రానా కూడా రీమేక్‌ విషయమై తనతో చర్చ జరిపారు అంటూ పేర్కొన్నాడు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అన్నాడు. తాజా వార్తల ప్రకారం ఈ రీమేక్‌ లో పవన్‌ తో పాటు మరో హీరోగా గోపీచంద్‌ ను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ కోసం గోపీచంద్‌ ను సంప్రదించగా అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. పవన్‌ మరియు గోపీచంద్‌ లు హీరోలుగా ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..

Yes, I am in a relationship with Ashu Reddy : rahul

chaithu and sai pallavi ended their ‘love story’!