in

will alia bhatt become minus for ‘rrr’?

ప్రజెంట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అంటే ‘సడక్ 2’ ట్రైలర్‌కి వస్తున్న డిస్-లైక్స్ అంశమే. సుశాంత్ మరణం తరవాత సోషల్ మీడియాలో నెపోటిజం డిస్కషన్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. స్టార్ కిడ్స్ మీద చాలామంది ఫైర్ అవుతున్నారు. అయితే, అది ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరూ ఉహించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’కి అలియా భట్ మైనస్ అవుతుందా? అని రాజమౌళి అభిమానులు కొందరు ఆందోళన చెందుతున్నారు.

సుశాంత్ మరణం తరవాత మహేష్ భట్ మీద విమర్శలు వచ్చాయి. అలియా భట్ ఆయనకు కుమార్తె. వాళ్ళిద్దరి తండ్రీకూతుళ్ళ బంధం పక్కన పెట్టినా… అలియా స్టార్ కిడ్. నెపోటిజం యాంగిల్‌లో ఆమెపై కొందరు ఫైర్ అవుతున్నారు. సుశాంత్ మరణానికి నెపోటిజం కారణమని భావించే వాళ్ళు ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో అలియా నటిస్తే… ప్రజెంట్ ‘సడక్ 2’ ట్రైలర్ మీద వ్యక్తమైన వ్యతిరేకత ఆ సినిమాపై కూడా పడుతుందా?

nivetha says no to marriage!

sdt’s next is a mystical thriller!