in

Why did Allu Arjun reject the movie Arjun Reddy?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వద్దకు అర్జున్ రెడ్డి కథ
ఈచిత్రంలో విజయ్ నటన ఆటిట్యూడ్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసాయి. కేవలం ఈ యొక్క చిత్రంతో సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడ అందరికీ తెలియని ఒక విషయం ఈ చిత్రం గురించి అదేంటంటే..అర్జున్ రెడ్డి చిత్రాన్ని మొదటగా విజయ్ దేవరకొండ తో తీద్దామనుకోలేదట.. అయితే మొదట చిత్రం యొక్క డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ కథను నేరుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వద్దకే తీసుకెళ్లి చెప్పారట.. కానీ అల్లు అర్జున్ చెప్పినప్పటికి ఈ చిత్రంలో ఉన్న ఇన్ని లిప్ లాక్ సీన్లు నచ్చక మరి అదేవిధంగా ఇందులో ఉన్న రౌడీ బాయ్ పాత్ర తనకు సెట్ గాక ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడట.

బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో అర్జున్ రెడ్డి బ్లాక్ బాస్టర్!
ఇక ఆ తర్వాత శర్వానంద్ ను కూడా సంప్రదించగా ఆయన కూడా ఇలాంటి విషయాలే చెప్పి చాలా సున్నితంగా వద్దని చెప్పాడట..ఆ తర్వాత అప్పుడప్పుడే మంచి మంచి చిత్రాలలో నటిస్తున్న విజయ్ దేవరకొండ చేతిలోకి వెళ్ళింది ఈ అవకాశం. దాంతో ఇంకేముంది బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యింది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ మొత్తాన్ని రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టించి తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఆ తర్వాత ఈ చిత్రాన్ని కోలీవుడ్లో రీమిక్స్ చేయగా బాలీవుడ్ లో కూడా రీమిక్స్ చేయగా బాలీవుడ్లో ఎవర్గ్రీన్ చిత్రంగా నిలిచింది. అర్జున్ రెడ్డి చిత్రం మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో..ఇక అల్లు అర్జున్, శర్వానంద్ లు ఈ చిత్రాన్ని అనవసరంగా వదిలిపెట్టామని అప్పుడప్పుడు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారట….!!

Sai Pallavi wants to work without a PR agency!

aishwarya rai shocking comments on her breakup!